![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద ఏ షో ఐనా కానీ కెమెరా, లైట్స్, రోల్ అంటే స్టేజి మీద చేసేది ఆడియన్స్ కోసం అన్నట్టు వుంటే ఆఫ్ స్క్రీన్ లో మస్త్ కామెడీ మస్త్ కంటెంట్ దొరుకుతుంది. కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ సెట్స్ లో ఆఫ్ స్క్రీన్ లో శ్రీముఖి-తేజస్విని మడివాడ మధ్య అలాంటి ఒక ఇంటరెస్టింగ్ టాపిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. శ్రీముఖి-తేజు రెడీ అయ్యి వచ్చి కూర్చుని సరదాగా చిట్ చాట్ చేసుకున్నారు. "ఈ వ్లాగ్స్ గిగ్స్ కాకుండా నువ్వు ఇంత అందంగా ఎలా తయారవుతున్నావో చెప్పు" అని శ్రీముఖిని తేజు అడిగింది. వెంటనే శ్రీముఖి "నన్ను చేసుకుంటావా పెళ్లి" అని అడిగేసింది. "నేను నిన్ను చేసుకోగలిగితే ఎప్పుడో చూసుకునేదాన్ని. అమ్మాయిల మీద ఫీలింగ్స్ ఉండి వుంటే గనక శ్రీముఖి నా ఫస్ట్ ఆప్షన్. కానీ అవకాశం లేదు కదరా.
మనందరికీ ఇండిపెండెన్స్ అలవాటైపోయింది. ముఖ్యంగా నీకు" అని తేజు చెప్పింది. "చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డేకి కూడా మనం ఇంత సెలెబ్రేట్ చేసుకోలేదు కానీ ఇప్పుడు ప్రతీ రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నాం కదా" అంది శ్రీముఖి. "నేనేమనుకుంటానంటే నీకు డబ్బులు, కార్ అవసరం లేదు. అన్నీ ఉన్నాయి నీకు. మరి నీకు అబ్బాయి ఎందుకు కావాలసలు జనరల్ గా" అని తేజు మళ్ళీ అడిగింది. "ఇప్పుడు పెళ్లి గురించి వద్దులే కానీ కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ చేసావ్ కదా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పు" అంటూ శ్రీముఖి మాట మార్చేసింది. "నాకు గేమ్స్ అంటే ఇష్టం. గేమ్స్ ఆడేటప్పుడు నా లైఫ్ గురించి మర్చిపోతూ ఉంటాను. ఈ షోని నేను బాగా ఎంజాయ్ చేసాను. డాన్స్ షోలో కానీ బిగ్ బాస్ లో కానీ నేను ఇంతలా ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు." అని చెప్పింది తేజు.
![]() |
![]() |